ఖజనా జ్యుయలరీ 4కోట్లు విరాళం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు సాగిస్తున్న పోరుకు మద్దతుగా ప్రముఖ నగల విక్రయ సంస్థ ఖజనా జ్యుయలరీ తన వంతు సాయాన్ని ప్రకటిచింది. ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.4 కోట్లను విరాళంగా ఇచ్చింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఖజానా జ్యూయలరీ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ కిషోర్ జైన్, డైరెక్టర్ అంకిత్ జైన్ ఇందుకు సంబంధించిన చెక్‌ను అందజేశారు. కాగా ఏప్రిల్ నెలలో 10 కోట్ల మొత్తాన్ని తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధికి అంజేస్తామని ఈ సంస్థ ప్రకటించింది.













