పీసీఏ చైర్మన్‍గా జస్టిస్ కనగరాజు

ఆంధప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‍గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‍ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులను త్వరలో నియమిస్తారు.