Jogi Ramesh : సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేశ్
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సీఐడీ (Jogi Ramesh) విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని తాడిగడప సీఐడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. వైసీపీ (YCP) హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఇటీవల జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు (CID notices) ఇచ్చింది. కేసుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని అందులో పేర్కొంది. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీసు స్టేషన్ (Tadepalli Police Station) లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.













