ముఖేష్ అంబానీతో లోకేష్ భేటీ
పారిశ్రామిక దిగ్గజయం ముఖేష్ అంబానీతో ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు ముంబై పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల, బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి మంత్రి వివరించారు. ఇటీవల తీసుకొచ్చిన టిటిపి పాలసీలో భాగంగా ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేష్ టెక్నాలజీ ఏజెన్సీ అన్ని అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నుండి భవనాలు అద్దెకు తీసుకుని 50శాతం రెంటల్ సబ్సిడీతో ఐటీ కంపెనీలకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ పాలసీలో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ నిర్మించే ఆఫీస్ స్పేస్ ప్రకారం 50 నుండి 70శాతం రెంటల్ గ్యారెంటీ ఇవ్వబడుతుందని, నిర్మించిన ఆఫీస్ స్పేస్ ఆధారంగా 18 నెలలు నుండి గరిష్టంగా 36 నెలల వరకూ రెంటర్ గ్యారంటీ వర్తిస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పెట్టి డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించాలని మంత్రి కోరారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు భూమి కేటాయింపు కూడా వీలైనంత త్వరగా చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికలతో మీ ముందుకు వస్తామని కంపెనీలు, బ్యాంకుల ప్రతినిధులు హామీ ఇచ్చారు. 27న జరిగే పుడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2017లో నోట్స్పీచ్ ఇవ్వనున్నారు.













