Jogi Ramesh: జోగి రమేశ్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొదు
చంద్రబాబు (Chandrababu) నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ నేతలు జోగి రమేశ్(Jogi Ramesh), దేవినేని అవినాష్(Devineni Avinash) సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ముగించింది. దేవినేని అవినాష్, జోగి రమేశ్ సహా 20 మందికి సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ (Bail) మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితులు మూడేళ్లుగా బెయిల్, ముందస్తు బెయిల్ కోరలేదు. ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారు. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసు. ప్రభుత్వం మారాక తప్పు బయటపడుతుందని తెలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం ఇంటిపై దాడి చేశారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో దేవినేని అవినాష్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి. అవినాష్ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా దర్యాప్తు జరపకుండా తాత్సారం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను పూర్తిగా ఉల్లంఘించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించలేదు. జోగి రమేశ్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దు. వీరిద్దరూ దర్యాప్తునకు సకహరించాల్సిదే అని సుప్రీంకోర్టు ఆదేశించింది.













