త్వరలో వైఎస్ జగన్‌కు ఈడీ నోటీసులు!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) అధికారులు అంతిమ లబ్ధిదారును తేల్చే పని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని విచారించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈడీ (ED) అధికారులు ఆయనకు నోటీసులు (Notices) జారీచేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటకే పలు దఫాలుగా అనేకమంది నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు, తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసుకు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో చివరిగా జగన్‌ను విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం. మద్యం కుంభకోణం దర్యాప్తులో అన్ని వేళ్లూ జగన్‌వైపే చూపుతున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్(SIT) ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా, ఈడీ దర్యాప్తులోనూ అదే విషయం స్పష్టమవుతునట్లు తెలుస్తోంది.








