టీడీపీకి మూడు.. జనసేనకు ఒకటి : కూటమి నేతల నిర్ణయం
రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ (TDP)కి మూడు, జనసేన (Janasena)కు ఒకటి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడించారు. సీఎం నివాసంలో ఎన్డీయే నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం-జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు సాగిన సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. రాజ్యసభ స్థానాలపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.








