పవన్ కల్యాణ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (Cabinet meeting)లో అధికారులు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖకు అవార్డులు (Awards) రావడంపై ఆ శాఖ అధికారులను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అభినందించారు. అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.








