ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… సమీప బంధువుల నుంచి కూడా
కిడ్నీ (Kidney) రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమీప బంధువుల నుంచి కిడ్నీలు స్వీకరించేందుకు రాష్ట్ర క్యాబినెట్ (State Cabinet) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కుటుంబ సభ్యుల కిడ్నీలను మాత్రమే తీసుకునే అవకావం ఉండేది. ఇక నుంచి తాత (Grandfather), అమ్మమ్మ, నానమ్మ కూడా కిడ్నీలు ఇవ్వవచ్చని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ (Satya Kumar) తెలిపారు.








