భవిష్యత్ ఏఐదే.. సత్యనాదెళ్ల సంచలన కామెంట్స్..!
ప్రస్తుతం ఎవరి చేతులో చూసినా స్మార్ట్ ఫోన్లు.. ఇక వాటిలో ఉన్న యాప్ లకు అయితే అంతే లేదు. ప్రతీ ఫోన్ యాప్ లతో నిండిపోయింది. ఏపని చేయాలంటే ఆయాప్ తీయడం.. ఆర్డర్ చేయడం ఫోన్ మూసేయడం ఇదీ ఇప్పటివరకూ జరుగుతున్న యాప్ ల పనితరు. అయితే..క్రమంగా యాప్ ల ప్రాధాన్యం తగ్గిపోనుంది. ఎందుకంటే యాప్ ల స్థానంలో ఇప్పుడు ఏఐ అసిస్టెంట్స్ యాక్టివ్ అవుతున్నాయి మరి.
భవిష్యత్తులో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్‌ల ప్రాధాన్యం తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్లు ఆక్రమించనున్నాయి. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2026 కాన్ఫరెన్స్‌లో కంపెనీ సీఈఓ సత్యనాదెళ్ల ఈ సంచలన విషయాలు చెప్పారు. ఇకపై మనుషులకు, కంప్యూటర్లకు మధ్య ఏఐ ఏజెంట్లే ప్రధాన వారధిగా మారతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త మార్పు కోసం మైక్రోసాఫ్ట్ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. క్వాల్కామ్ భాగస్వామ్యంతో ‘ప్రాజెక్ట్ సొలారా’ అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, క్లౌడ్ సేవలను అనుసంధానిస్తుంది. దీనివల్ల కంప్యూటర్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం రానుంది. యాప్స్ ఓపెన్ చేసే అవసరం లేకుండా నేరుగా ఏఐ ద్వారా పనులు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
నో యాప్స్.. ఓన్లీ ఏఐ
ఇప్పటివరకు మనం పనుల కోసం వేర్వేరు యాప్‌లు ఓపెన్ చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు మన తరఫున పనులు పూర్తి చేస్తాయి. ఇవి కేవలం ఒక యాప్‌కే పరిమితం కావు. వేర్వేరు సాఫ్ట్వేర్లు, పరికరాల మధ్య సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. మనం ఇచ్చే వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్స్ ఆధారంగా ఇవి స్పందిస్తాయి.
స్క్రీన్కు తగ్గట్లుగా మార్పులు
కొత్త ప్లాట్ఫామ్లో ‘జస్ట్ ఇన్ టైమ్ UI’ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీనివల్ల డెవలపర్లు ప్రతి డివైజ్ కోసం విడిగా ఇంటర్ఫేస్ డిజైన్ చేయక్కర్లేదు. స్క్రీన్ సైజు, వాయిస్, టచ్ వంటి ఆప్షన్లకు తగ్గట్లుగా ఏఐ ఏజెంట్లే స్క్రీన్ డిజైన్‌ను మార్చేస్తాయి. ఇది కొత్త గ్యాడ్జెట్ల తయారీ ఖర్చును, శ్రమను బాగా తగ్గిస్తుంది
ఒకటి కంటే ఎక్కువ ఏజెంట్లు
భవిష్యత్తు మొత్తం ఒకే ఒక్క ఏఐ అసిస్టెంట్‌తో నడవదు. వేర్వేరు పనుల కోసం ప్రత్యేకమైన ఏఐ ఏజెంట్లు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని తెస్తోంది. ఏ పనిని ఏ ఏజెంట్‌కు అప్పగించాలో ‘ఏజెంట్ టాస్క్ మేనేజర్’ డిసైడ్ చేస్తుంది. ఆయా రంగాల కంపెనీలు తమ సొంత ఏజెంట్లను కూడా ఇందులో వాడుకోవచ్చు.








