కిమ్ నవ్వాడు.. ఉత్తరకొరియా పులకించింది..!
కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తరకొరియా నియంత.. అసలు అది ఓ దేశమని.. దానికి ఓ రాజ్యాంగం ఉంటుందన్న విషయాన్ని ఉత్తరకొరియా ప్రజలు మర్చిపోయి దశాబ్దాలు దాటుతోంది. వారందరికీ తెలిసింది ఒక్కటే. అదీ కిమ్ నుంచి వచ్చే ఆదేశాలు పాటించడం..నవ్వాలన్న , ఏడవాలన్నా.. కనీసం పడుకోవాలన్నా అంతా కిమ్ జోంగ్ ఉన్ దయ. కాదన్నారో మెడకాయమీద తలకాయ ఉండదు.
అంతేకాదు.. ఎప్పుడు చూసినా కిమ్ సీరియస్ గా ఉంటాడు. వివిధ దేశాధినేతలతో చర్చల సమయంలోనూ కిమ్ నవ్వగా చూసింది లేదు. అలాంటి కిమ్ ఓసారి నవ్వితే.. ఆదేశం ఆనందంతో ఊగిపోదా.. ప్రస్తుతం అదే జరిగింది. కిమ్ నవ్వాడు. ఉత్తరకొరియన్లు ఆనందంలో గంతులేస్తున్నారు.
ఇటీవల ప్రతిష్టాత్మక ఏఎఫ్ సీ ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెల్చుకుని నాగోహ్యాంగ్ ఫుట్ బాల్ క్లబ్ చరిత్ర సృష్టించింది. నార్త్ కొరియా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఆ జట్టు ప్లేయర్లను కిమ్ జోంగ్ అభినందించారు. అందరికీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కిమ్ తో షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ప్లేయర్లు ఆనందంతో గంతులు వేశారు. ఇంకొంతమంది భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సౌత్ కొరియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టోక్యో జట్టుపై ఉత్తర కొరియా విజయం సాధించింది.








