ప్రతి విద్యాలయంలో పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియం, డిజిటల్, వర్చువల్ తరగతులు
పదో తరగతి పరీక్షల్లో గత విద్యాసంవత్సరం కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా 95 శాతం ఉతీర్ణత. ఈ విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం.
2017-18 విద్యా సంవత్సరంలో NEET-లో 150మంది, IITలో 82 మంది అర్హత సాధించారు, ఇది గర్వకారణం
MBBSలో 10 మంది, BDSలో ఇద్దరు చేరారు.
‘వరల్డ్ మేకర్ ఫెయిర్’ న్యూయార్క్‌కు 11 మంది ఎంపికయ్యారు.
హిందీ ప్రాధమిక, మధ్యమ, రాష్ట్ర బాషా పరీక్షలకు హాజరైన 15010 విద్యార్ధుల నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.
జపనీస్ లాంగ్వేజ్‌లో 5 గురు విద్యార్ధుల ఉత్తీర్ణత పొందారు.
జపాను నుంచి ఎవరైనా వస్తే మీరే నాకు ట్రాన్స్లేషన్ చేయాలి : జపనీస్ నేర్చుకున్న పిల్లలకు సీయం ఆఫర్. విద్యతో పాటురాష్ట్ర వాప్తంగా 22 వేల మంది విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్, 10 వేల మందికి వృత్తి విద్యలో శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రతి విద్యార్ధికి నైపుణ్య వికాసం ద్వారా IT, కమ్యునికేషన్ఇంగ్లీష్లలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం.
అంతర్జాతీయ కరాటే చాంపియన్‌షిప్ అండర్ 12 విభాగంలో తాడేపల్లిగూడెం గురుకుల విద్యార్ధి గౌరవ్ శ్యాం దీపక్ బంగారు పతకం సాధించాడు.
గడిచిన రెండేళ్లలో 14 మంది గురుకుల విద్యార్ధులు ఎవరెస్టు అధిరోహించారు.
కోలాటం, కూచిపూడి, అంబేత్కర్ నృత్య రూపకం విభాగాల్లో మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు.
ఇండియా బుక్ అఫ్ రికార్డ్, 6 తెలుగు బుక్ అఫ్ రికార్డులు సాధించారు.
ప్రపంచ మెమరీ చాంపియన్‌షిప్ కు నలుగురు విద్యార్ధుల ఎంపికయ్యారు.
జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో రెండు కాంస్య పతకాలు సాధించారు.
పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నాం. పుస్తకాలు, యూనిఫారంతోపాటు పాదరక్షలు, సబ్బు, దువ్వెన, పేస్టు ఇస్తున్నాం.
ఇవన్నీ విద్యార్ధులకు సరిగా అందేలా సాంకేతికత ఉపయోగించి అన్నపూర్ణ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం.
సమర్థులైన ఉపాధ్యాయులతో బోధన, మెరుగైన వసతి సౌకర్యాలు, మంచి పౌష్టికాహారం, ఆటపాటల్లో శిక్షణ అందిస్తున్నాం.
విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడేలా గురుకులాల్లో కార్పొరేట్ సంస్థలను మించిన ఏర్పాట్లు చేశాం.
అంబేద్కర్ జీవితాన్నే ఆదర్శంగా తీసుకోండి. పుట్టుక మన చేతిలో లేదు, కానీ మన భవిత మన చేతిలో ఉందని అంబేద్కర్ చెప్పారు.













