సీఎం చంద్రబాబుకు కృతజ్ఞలు తెలిపిన అవినాష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేవినేని అవినాష్ కృతజ్ఞలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు ఇది అందుతుంది. పేదలు తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. సుమారు 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేసినా, ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కుటుంబానికి ఒక్కరికే నిరుద్యోగ భృతి అన్న పరిమితి లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇవ్వాలని నిర్ణయించింది.













