వైకాపాలో చేరిన దేవినేని అవినాష్
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే సీఎం జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నా. 40 ఏళ్లు దేవినేని రాజశేఖర్ కార్యకర్తలకు అండగా ఉన్నారు. వాళ్ల సూచనతోనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సీఎం నవరత్నాలను ప్రారంభించారు. ఇదే నన్ను ఆకర్షించింది అని తెలిపారు. తనకు వ్యాపారాలు లేవని, ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు.













