ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్
జీ-20 సదస్సు సన్నాహకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ముఖ్య మంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.













