ఇదంతా ప్రజల విజయమే : ఏపీ సీఎం జగన్
మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభీ మ్రోగించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గొప్ప విజయం ప్రజలదే అని ప్రకటించారు. తనమీద పెట్టుకున్న నమ్మకం, తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ‘‘ఈ గొప్ప విజయం ప్రజలది. నా మీద మీరు పెట్టిన నమ్మకం, మీ పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయపడతా. దేవుని దయతో ప్రతి ఒక్క చెల్లమ్మా, ప్రతి సోదరుడు, స్నేహితుడు, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కాచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా.’’ అని సీఎం జగన్ ప్రకటించారు.













