ఎంపీ శివప్రసాద్ కు సీఎం చంద్రబాబు అభినందనలు
తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అనారోగ్యంగా ఉన్నా సభకు హాజరైనందుకు అభినందించారు. అనారోగ్యం కారణంగా ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని చెప్పగా దాన్ని ఎంపీ శివప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. రెగ్యులర్ విమానంలోనే ఎంపీ శివప్రసాద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు అవిశ్వాసంపై లోకసభలో చర్చ జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీకి వచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడగా అవసరం లేదని ఎంపీలు తెలిపారు. ఎంపీల సూచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారు.













