Jagan – Chandrababu : జగన్ బెయిల్ రద్దయితే చంద్రబాబు వద్దంటారా..?
ఆంధ్రప్రదేశ్ (AP) లో ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ (YS Family) ఆస్తి పంపకాల వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతోంది. తల్లి, చెల్లికి ఆస్తుల్లో వాటాలు ఇచ్చేందుకు జగన్ (YS Jagan( నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటని ఆయన అభిమానులు చాలా మంది ఆవేదన చెందుతున్నారు. అయితే కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు చంద్రబాబుతో (Chandrababu) కలిసి వైఎస్ షర్మిల (YS Sharmila ) ప్రయత్నిస్తోందనేది జగన్ ఆరోపణ. అక్రమాస్తుల కేసులో తన బెయిల్ (bail) రద్దు చేయించేందుకు షర్మిల కుట్రచేస్తోందనేది ఆయన మాట. మరి జగన్ బెయిల్ రద్దయితే చంద్రబాబు వద్దంటారా..?
రాజకీయ పార్టీలు (Political parties) రాజకీయమే చేస్తాయి. ప్రత్యర్థిని ఇబ్బందులు పెట్టి తాము లబ్ది పొందేందుకు అనుక్షణమూ ప్రయత్నిస్తుంటాయి. ఏ పార్టీ సిద్ధాంతమైనా ఇలాగే ఉంటుంది. గత ఐదేళ్లూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అణగదొక్కేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనపై పలు కేసులు పెట్టారు. ఓ కేసులో ఆయన్ను జైలుకు (jail) కూడా పంపగలిగారు. చివరకు ఆయనకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం. దేశంలోనే పేరొందిన లాయర్లను ఇందుకోసం భారీ ఖర్చు చేసి పెట్టుకుంది.
అంటే చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు నాడు జగన్ శతవిధాలా ప్రయత్నించారు. అందులో తప్పులేదు.. ఎందుకంటే అది ఆయన రాజకీయం. ప్రత్యర్థి లేకుంటే తనకు మార్గం సుగమం అవుతుందనే అందరూ అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలానే చేయొచ్చు. వైఎస్ కుటుంబాల్లో ఆస్తి పంపకాల వ్యవహారం కోర్టుకు చేరింది. ఒకవేళ కోర్టు జగన్ బెయిల్ రద్దు చేస్తే తప్పకుండా టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. టీడీపీ కూడా జగన్ బెయల్ రద్దు కావాలనే కోరుకుంటుంది. ఇందులో ఆశ్చర్యమే అక్కర్లేదు.
అయితే తన బెయిల్ రద్దు కోసం చంద్రబాబుతో కలిసి షర్మిల ప్రయత్నిస్తోందనేది జగన్ ఆరోపణ. అయితే షర్మిల – చంద్రబాబు మధ్య ఈ అంశానికి సంబంధించిన సహేతుకమైన ఆధారాలను మాత్రం జగన్ బయటపెట్టలేకపోయారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకు గురైనప్పుడు జగన్ అండ్ కో ఇలాగే ఆరోపించింది. ఈ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని నారాసుర రక్త చరిత్ర (Narasura Rakta Charithra) పేరుతో పెద్ద పెద్ద కథనాలే రాసింది. అయితే ఆ తర్వాత ఈ హత్యలో తన కుటుంబసభ్యులే ఉన్నారని సీబీఐ తేల్చడంతో కామ్ అయిపోయారు. ఇప్పుడు తన కుటుంబ ఆస్తి పంపకాల వ్యవహరంలో కూడా చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. చూడాలి మరి ఇందులో అయినా చంద్రబాబు పాత్రను జగన్ బయట పెట్టగలరో లేదో..!!













