మీరు చూపిన అభిమానం.. ఎప్పటికీ మర్చిపోలేను : చంద్రబాబు
కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ నేను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఫీుభావం తెలిపారు. పూజలు చేశారు. తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. సంఫీుభావం తెలపడంతో నేను చేసిన అభివృద్ధిని కూడా మీరు వివరించారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికీ రాదు. 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయనివ్వను. నాకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అక్రమ అరెస్టును ఖండిరచిన రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు. సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నాకు కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నా విధానాల వల్ల లబ్ధిపొందిన ఐటీ ఉద్యోగులంతా ఆ కార్యక్రమంలో పాల్గొని వివరించారు అని చంద్రబాబు తెలిపారు.













