కొలకనూరు ఇనాక్ ను సన్మానించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కొలకనూరు ఇనాక్ ను ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా కొలకనూరు ఇనాక్ ను నియమిస్తూ పత్రాలు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అందజేశారు, కవులకు వన్నె తెచ్చ్చిన వ్యక్తి , ప్రతిభ ఇనాక్ దన్నారు. ఇనాక్ గతంలో శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీకి వీసీగా బ్రహ్మడంగా పని చేసి పేరు తెచ్చ్చారన్నారు. చాలా తక్కువగా మాట్లాడతారన్నారు. సాహిత్యం, సృజన , విమర్శ లను సమపాళ్లలో సమర్థవంతంగా అక్షరీకరించిన ఇనాక్ ప్రతిభావంతులన్నారు. సాహిత్యంలో బలమైన ముద్ర వేశారన్నారు.సాహిత్యవేదికగా సమాజంతో మమేకమై దళితులకు సాదియారత తెచ్చ్చారన్నారు.
ఇనాక్ చరిత్ర సాహిత్య ఈ తరం భవిష్యత్ తరాలకు స్ప్ర్తిదాయకమన్నారు. ఇనాక్ డి మంచి వ్యక్తిత్వం మృధుస్వభావి అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ పదవిలో ఇనాక్ ను నియమించడం నా అదృష్టమన్నారు .. దేశంలోని 24 భాషల్లో తెలుగు భాషలో ఇనాక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడంగర్వకారణం అన్నారు.
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ … రాష్ట్రంలోని దళితసోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. దళిత వాడలకు మౌలిక సదుపాయాలు కల్పించాం
దళితవాడల్లో మార్పులను గుర్తించాలి …వైఎస్ హయాంలో సబ్ ప్లాన్ నిధులను మల్లించారు… పులివెందుల , హుస్సేన్ సాగర్ పరిశుభ్రతకు ఖర్చు చేశారు.
దళితుల అభివృద్ధిని నీరుగార్చారు.. ఎస్సీ కార్పొరేషన్ ని కూడా వృధా చేశారు.. అనాధలకు, పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. ఏస్టి ఎస్సీ మైనారిటీల పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 40, 50 వేలు ఇచ్చ్చామన్నారు అన్న క్యామ్టీన్లు పేదలవరమన్నారు. దళితులకు గౌరవప్రదమైన జీవితాన్ని నాడు ఎన్ఠీఆర్, నేడూ తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. వంద యూనిట్ల కరెంటు బిల్లును తీసివేశామన్నారు దళితుల ఆదాయం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం . మాదిగలు, మాలలు సమానప్రాతిపదిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం ..లిడ్ క్యాప్ కారొరేషన్ ను ఏర్పాటు చేసి ఇరువర్గాలకు సమానం ప్రాధాన్యమిస్తా మన్నారు . తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలలో దళితులూ అండగా ఉండాలని కోరారు . పేదలను ఉన్నతస్థానానికి తీసుకెళ్లేది ఒక్క తెలుగుదేశం పార్టీనే నన్నారు. ఈ పార్టీని, ప్రభుత్వాన్ని మల్లె గట్టెక్కించే బాధ్యత దళితులదన్నారు. మెరుగైన జీవితాన్ని పొందడానికి తెదేపా ప్రభుత్వాన్ని గెలిపించాలని సూచించారు. పలువురు మంత్రులు పాల్గొన్నారు.













