ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై ఎక్సైడ్ డ్యూటీ రద్దు చేసిన కేంద్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధనా సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ప్రజలపై దీని భారం తీవ్రంగా పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, ధరలను అదుపులో వుంచడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
ఎక్కువ పరిమాణంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం వున్న పెట్రోల్ ను ఎక్సైజ్ డ్యూటీ పరిధి నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే ఇకపై మార్కెట్ లోకి వచ్చే ఇ22, ఇ25,ఇ27,ఇ30 కేటగిరీల పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరమే వుండదు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. ఇథనాల్ బ్లెండింగ్ ను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్ ధరలను స్థిరీకరించవచ్చని, అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ప్రభుత్వ భావన.
బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా మినహాయించినట్లు జూన్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గత మార్చి చివర్లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రికత్తల కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ. 21.5, విమాన ఇంధనం ఎగుమతులపై లీటర్‌కు రూ. 29.5 చొప్పున కేంద్రం సుంకాలు విధించింది.








