విశాఖలో బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సు
బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సైబర్ సెక్యూరిటీ పెంచేందుకు విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ వ్యాపార సదస్సు అక్టోబరు 9,10 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు. బ్లాక్ చైన్ కాన్ఫరెన్స్ ద్వారా అనేకమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎక్కువ వాడే కంపెనీలు అన్ని ఈ సదస్సుకు హాజరు అవుతాయని తెలిపారు. ఆర్బీఐ సెబీ వంటి ప్రతినిధులు కూడా వస్తున్నారని తెలిపారు.
భారత ప్రభుత్వం సహకారం కూడా ఈ సదస్సుకు వుందన్నారు. దేశంలో టెక్నాలజీ వాడే రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీకి ఏపీనే కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలందించాలనేది మా ప్రయత్నం అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ రెవెన్యూ, రవాణా రంగాల్లో ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టామని తెలిపారు. పరిపాలన అంతా టెక్నాలజీతోనే జరుగుతున్నందున్న హ్యాకింగ్ బెడద లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.













