సీఎం వైఎస్ జగన్ ను కలిసిన బీసీ సంఘాల ప్రతినిధులు
అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణనపై శాసనసభలో తీర్మానం చేసిన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణా, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, ఆర్ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహన్రావు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.హనుమంతరావు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె క్రాంతి కుమార్ ఉన్నారు.













