Azerbaijan : పాక్‌తో స్నేహం చేస్తున్నందుకు భారత్ మాపై కక్షగట్టింది

పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండటం వల్లే భారత్ (India ) తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని అజర్‌బైజాన్ (Azerbaijan) తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచ వేదికల్లో తమను అడ్డుకుని ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందని విమర్శిలు గుప్పించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాక్‌కు సహకారం అందించినందుకే షాంఘై సహకార సంస్థ ( ఎస్‌సీవో) సదస్సులో పూర్తి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుందని పేర్కొంది. ఈ చర్యలు బహుళపాక్షిక దౌత్య ఉల్లంఘనేనని తూలనాడిరది. అంతర్జాతీయ వేదికల్లో ఢల్లీి తమపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ తాము ఇస్లామాబాద్ (Islamabad) లో సంబంధాలు కొనసాగిస్తామని అజర్‌బైజాన్ ఓ ప్రకటనను విడుద చేసింది. రాజకీయంగా, వ్యూహాత్మకంగా ఇరు దేశాల మధ్య లోతైన బంధాలు ఉన్నాయని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ పేర్కొన్నారు.