భామినిలో గిడ్డంగులను ప్రారంభించిన కిమిడి కళా వెంకట్రావు, యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్
రైతుల సౌకర్యార్ధం గిడ్డంగులను భామినిలో ఏర్పాటు చేసామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకట రావు అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధఆధ్వర్యంలో పది వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల రెండు గిడ్డంగులను నిర్మించారు. ఈ గిడ్డంగులు 57,200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. గిడ్డంగులతోసహా 60 మెట్రిక్ టన్నులతూకంగల వెయింగు బ్రిడ్జి, కార్యాలయ భవనం, మౌళికసదుపాయాలను రూ.5.20 కోట్లతో నిర్మించారు. ఈ గిడ్డంగులను మంగళ వారం ఉదయం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ సమక్షమంలో ఇంధన శాఖ మంత్రి కళా వెంకట రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ భామిని ప్రాంతంలో గిడ్డంగులసౌకర్యం లేకపోవడం వలన రైతులు తమ సరుకులను నిల్వ చేయుటకు ఇబ్బందులు ఏర్పడటాన్ని గమనించామన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించుటకు గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ నుకోరిన వెంటనే మంజూరు చేసి నిర్మించారని తెలిపారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు.రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసిందని, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిందని చెప్పారు. జిల్లాలో 690 రైతురథాలను రాయితీపై అందించిందని ఆయన చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుండే కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రూ.6 వేల విలువగల పరికరాలనుబిడ్డ గర్భంలో ఉన్నప్పుటి నుండి పుట్టిన రోజు వరకు అందిస్తుందని అన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, ఎన్.టి.ఆర్ వైద్య ఆరోగ్య సేవ వంటి కార్యక్రమాలతో వైద్యాన్ని పేద ప్రజానీకానికి దగ్గరచేసిందని ఆయన వివరించారు. పేదలందరికి గృహ నిర్మాణం చేపడుతుందని చెప్పారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ శ్రీకాకుళం జిల్లాలో ఇంకా 70 నుండి 80 వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగులను నిర్మించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.భామినిలో ఇంకా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గిడ్డింగి కావాలని కోరారాని, ఆ మేరకు ఏడాది కాలంలో నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంమేరకుగల గిడ్డంగులను ప్రభుత్వ ఆధ్వర్యంలోను, మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గిడ్డంగులను ప్రైవేటు సంస్ధల నుండి తీసుకుని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మేర గిడ్డంగుల నిర్మాణానికి ముఖ్య మంత్రి మంజూరు చేసారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ రీజనల్ మేనేజర్ డి.సత్యం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిడ్డంగులను అధికంగా నిర్మించుటకు గిడ్డంగుల సంస్ధ ఎంతగానో తోడ్పాటును అందించిందన్నారు. విజయనగరం జిల్లా డొంకినవలస, పరవాడలలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం చొప్పున గిడ్డంగులను నిర్మించడం జరిగిందన్నారు. నారాయణవలస, బలిజిపేట, బైరిపురంలలో గిడ్డంగులనిర్మాణానికి సంస్ధ చర్యలు చేపట్టిందని చెప్పారు.
ఈ కార్యర్రమంలో ఎస్.సి,ఎస్.టి సబ్ ప్లాన్ కమిటి సభ్యులు నిమ్మక జయరాజు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్.గున్నయ్య, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఆర్.వెంకటేశ్వరరావు, మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులు వై.వి.శ్యామ్ కుమార్, గిడ్డంగుల సంస్ధ ఉపకార్యనిర్వాహక ఇంజనీరు తవిటి రాజు, తోటపల్లి ప్రాజెక్టు అధ్యక్షులు నిమ్మక పాండురంగరావు,ఎం.పి.పి బి.ఉషారాణి, జెడ్పిటిసి సోమరాజు గోపాల రావు, ఎం.పి.టి.సి సుధారాణి, సర్పంచు పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గిడ్డంగుల సంస్ధ ఆధ్వర్యంలో కోల్డు స్టేరేజీలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఆధ్వర్యంలో కోల్డు స్టోరేజీలను ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగలగిడ్డంగులను మంగళ వారం ప్రారంభించిన అనంతరం మీడియా ప్రతినిధులతో ఛైర్మన్ ప్రసాద్ మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం దిగుబడి బాగుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు త్వరలోపూర్తి అవుతుందని తద్వారా అదనంగా లక్ష ఎకరాలకు నీరు అందుతుందని జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ధాన్యం, పంటల నిల్వలకు అవసరమగు గిడ్డంగులునిర్మించాలని అన్నారు. రెండు పంటలు పండించడం జరుగుతున్న దృష్య్టా గిడ్డంగుల సామర్ధ్యం పెంచాలని అన్నారు. ఇప్పటికే 70 నుండి 80 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గిడ్డంగులుఅవసరమని గుర్తించామని చెప్పారు. భామినిలో మరో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంగల గిడ్డంగులను నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మేరకుగలగిడ్డంగులను ప్రభుత్వ ఆధ్వర్యంలోను, మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గిడ్డంగులను ప్రైవేటు సంస్ధల నుండి తీసుకుని నిర్వహిస్తున్నామని చెప్పారు.













