Amaravati: రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి బిల్లు.. నేడే ఆమోదముద్ర..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అమరావతికి ఏకైక రాజధానిగా శాశ్వత చట్టబద్ధత కల్పించే “ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026” సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. ఇప్పటికే పార్లమెంట్‌లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు సంతకం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయ సభలైన లోక్‌సభ (ఏప్రిల్ 1)(Loksabha) మరియు రాజ్యసభ (ఏప్రిల్ 2)(Rajyasabha) ఆమోదం పొందిన అనంతరం, ఈ కీలక బిల్లు సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది.
ఇవి కూడా చదవండి
ఈ బిల్లుపై సంతకం చేసే ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారట. రాజ్యాంగపరమైన అంశాలను, బిల్లులోని సాంకేతిక వివరాలను నిశితంగా పరిశీలించిన అనంతరం, నేడు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడి, గెజిట్ విడుదలైన క్షణం నుండి అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా, శాశ్వత చట్టబద్ధమైన రాజధానిగా మారుతుంది.
ఈ చట్టం జూన్ 2, 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చే లేదా మూడు రాజధానుల వంటి ప్రతిపాదనలు తెచ్చే అవకాశం ఉండదు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ ద్వారా ఇలాంటి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించడం ఇదే తొలిసారి. గత పదేళ్లుగా నెలకొన్న రాజధాని సందిగ్ధతకు ఈ బిల్లుతో శాశ్వత పరిష్కారం లభించనుంది. అమరావతి ప్రాంత రైతులు, రాజధాని ఉద్యమకారులు, ఏపీ ప్రజలు ఈ పరిణామం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








