Amaravati :రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి (President) ఆమోదం అనంతరం ఇది చట్టరూపం దాల్చనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు పార్లమెంట్ (Parliament) ఇటీవల ఆమోదం తెలిసిన విషయం తెలిసిందే. లోక్సభ (Lok Sabha), రాజ్యసభల్లో బిల్లుపై చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఉభయ సభల ఆమోదం తర్వాత లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపింది.
ఇవి కూడా చదవండి








