ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, జీవో 85లను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు తీర•ను వెలువరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ వాదిస్తూ ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్‌లాగ్‌లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది తీర్పును వెలువరిస్తూ 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు సృష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.













