కువైట్‌లో పర్యటించాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు మార్గం సుగమం చేయడానికి ప్రవాసాంధ్రులను చైతన్యపరచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో కువైట్‌లో పర్యటించనున్నారు. కువైట్‌లో పర్యటించాలని చంద్రబాబును ఏపీఎన్ఆర్ట్ గల్ఫ్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఏపీఎన్ఆర్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు వేమూరి రవి నేతృత్వంలో ఏపీఎన్ఆర్టీ గల్ప్ విభాగం ప్రతినిధులు మొహమ్మద్ బోరా, మలకల సుబ్బారాయుడులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని ఈ మేరకు ఆహ్వానం పలికారు. ఏపీఎన్ఆర్టీ గల్ఫ్ విభాగం ప్రతినిధులుగా తమను నియమించినందుకు ముఖ్యమంత్రికి వీరు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్‌లో లక్షలాదిమంది ఉభయ రాష్ట్రాలకు చెందిన వారు ఏళ్ల తరబడి ఉద్యోగ, ఉపాధి రంగాల్లో భాగం పంచుకుంటూ ఇతరత్రా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధులై ఉన్నారని ఏపీఎన్ఆర్టీ గల్ఫ్ విభాగం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.













