అందుకే మోదీ దిగజారి మాట్లాడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ బలహీనపడుతున్నారు. నన్ను చంపేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష నేతల దుస్తులపైనా మాట్లాడుతున్నారు. ఆయన నిరాశా నిస్పృహలకు లోనైన విషయాన్ని ఇవి సృష్టం చేస్తున్నాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ధోరణి మారింది. మొన్నటిదాక ప్రగల్భాలు పలికిన వాళ్లు ఇప్పుడు మోదీ అధికారంలోకి రారనే సరికి ఏం చేయాలో ఆలోచిస్తున్నారు అని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. నేరం చేయబోయే ముందు నెపాన్ని తెలుగుదేశంపై వేయడం వైకాపాకు అలవాటుగా మారిందన్నారు. తుపాను సమయంలో సమీక్షకు ఒడిశాలో అమనుతి ఇచ్చి మనకు ఇవ్వకపోవడం దుర్మార్గమని ముఖ్యమంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు.













