ప్రవాసాంధ్రులకు ఏపీఎన్నార్టీ సూచన
కరోనా వైరస్ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్మెస్టీని ఉపయోగించుకోవాలని ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్నార్టీ విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో చట్టవిరుద్దంగా ఉంటున్నవారికి ఎలాంటి జరిమానాలు విధించకుండా ఉండడంతో పాటు మళ్లీ కొత్త వీసాతో వచ్చేందుకు కువైట్ ప్రభుత్వం అనుమతించిందన్నారు. ప్రస్తుతం కువైట్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రులకు తాత్కాలిక పాస్‌పోర్టులు ఇచ్చి రాష్ట్రానికి పంపించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఈ పక్రియ ప్రారంభమవుతుందని, ఈ తాత్కాలిక పాస్‌పోర్టు కూడా ఉచితంగానే అందిస్తున్నారని ఏపీఎన్నార్టీ సీఈవో వెంకట్ మేడపాటి తెలిపారు.













