Jogi Ramesh: వైసీపీ నేత జోగి రమేశ్ పై నాన్ బెయిలబుల్ కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ (Jogi Ramesh) పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జగన్ (Jagan) పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పీఎస్లో ఎస్ఐ రవి వర్మ (SI Ravi Varma) ఫిర్యాదు చేశారు. బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని, రోడ్లు బ్లాక్ చేశారని, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని జోగి పై ఫిర్యాదు చేశారు. సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













