ఏపీఎన్ఆర్టీఎస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన
ఆంధప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) విజయవాడలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో వివిధ కళాశాలల నుంచి 780 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో 180 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. నార్మ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, హెడ్రన్, కాడెప్లోయ్, ఇన్ఫోక్యురిస్ సంస్థలు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి.. అభ్యర్థులకు పలు కోర్సులో ఐటీ, సాఫ్ట్వేర్ శిక్షణను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.













