జూలైలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ భేటీ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీ మొదటి సమావేశానికి జర్మనీలో జూలైలో జరిగే జీ-20 సమావేశాలు వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే అమెరికాకు రావాలని ట్రంప్ ఇప్పటికే మోదీకి ఆహ్వానం పలికి ఉన్నారు. మోదీ కూడా ట్రంప్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఇరు దేశాల నేతలూ ఆహ్వానాలను మన్నించినప్పటికీ, తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వేరే ప్రయాణలు లేని పక్షంలో జీ-20 సమావేశాల సందర్భంగా ఇద్దరు నేతలు మొదటిసారిగా కలుసుకునే అవకాశం ఉంది.






