రాష్ట్రపతి రేసులో నేను లేను
బీజేపీ సీనియర్ నేత ఎల్కె అడ్వాణీ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి రేసులో తాను లేనని ప్రకటించారు. దీంతో బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం ముగుస్తుండటంతో రాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తు మొదలైంది. బీజేపీ నుంచి రాష్ట్రపతి రేసులో అడ్వాణీ ఉన్నారంటూ, మోడీ కూడా అడ్వాణీకి సముచిత స్థానం కల్పించేందుకు ఇదే అవకాశమని భావిస్తున్నట్లు జాతీయ మీడియా ఇన్నాళ్లూ కోడై కూసింది. అడ్వాణీ ప్రకటనతో తదుపరి రాష్ట్రపతి రేసులో బీజేపీ నుంచి ఎవరుంటారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.













