రాజకీయాల్లోకి రాను … సర్వేలు కొనసాగిస్తా
నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సృష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల తీర్పు టీడీపీ వైపే ఉందని తాను చేయించిన సర్వేలో తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనందునా ఏయే అంశాలు టీడీపీ గెలుపుపై ప్రభావితం చూపిస్తాయో చెప్పలేనని అన్నారు. నాకు రాజకీయాలు ప్రాణమే అయినా ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొలగాను. నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. రాజకీయాల్లో లేకపోయినా విశ్లేషణ నావ్యాపకం కాబట్టి సర్వేలు కొనసాగుతాయి. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సర్వేలు జరిపిస్తాను అని చెప్పారు. గతంలో ప్రజలు కోరితే తాను రాజకీయాల్లోకి రాలేదని, తనకు రాజకీయాలంటే ఇష్టం కాబటి ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. కాగా, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని సృష్టం చేశారు.













