భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్లు
ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతంతో గణనీయంగా వృద్ధి చెంది 2020 నాటికల్లా ఇంటర్నెట్ ఎకానమీ 215–265 బిలియన్ డాలర్ల స్థాయికి (జీడీపీలో 7.5 శాతం) చేరవచ్చని కన్సల్టెన్సీసంస్థ బీసీజీ, ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో అంచనా వేశాయి. ఆన్లైన్ యూజర్లు, డేటా వినియోగం వేగంగా ఎదుగుతున్ననేపథ్యంలో 2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.16,25,000 కోట్లు) చేరనుంది. ప్రస్తుతం ఇది 100–130 బిలియన్ డాలర్ల(స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 5 శాతం వాటా) స్థాయిలో ఉంది.













