గుండెపోటును ముందుగా గుర్తించే పరికరం
గుండెపోటును ముందుగా గుర్తించే పరికరాన్ని తయారుచేసి పదో తరగతి విద్యార్థి అకాశ్మనోజ్ ప్రశంసలను అందుకున్నాడు. ఈ ఆలోచనకు మెచ్చి రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల ఢిల్లీలో బాలుడిని నవ ప్రవర్తన్ పురస్కార్‌తో సత్కరించారు. తమిళనాడు హోసూరు నగరానికి చెందిన ఈ బాలుడు అశోక్లేల్యాండు పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రపంచంలో అనేక మంది గుండెపోటుతో మృతి చెందుతుడడం, తన తాత కూడా అలాగే కన్నుమూయడంతో మనోజ్‌లో ఆలోచనలు మొదలయ్యాయి. అంతర్జాలంలో శోధిస్తూ ఆవిష్కరణలు ప్రారంభించాడు. తండ్రి ప్రదీప్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమా శ్రీనివాస్‌లు ప్రోత్సహించారు. బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ ప్రయోగానికి మెరుగులు దిద్దింది. కేవలం రూ.900 ఖర్చుతో రూపొందించిన ఈ పరికరం ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుల ప్రశంసలు పొందింది. జపాన్‌లోని టోక్కో విశ్వవిద్యాలయం విజ్ఞాన విభాగం వారి దృష్టికి సైతం వెళ్లింది. తమ దేశానికి రావాలని వారు బాలుడికి ఆహ్వానం పంపారు.













