ట్రంప్ కు దీటుగా సమాధానం చెప్పిన మోడీ
భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ ప్రకటన చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్-పాక్ చర్చల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ఏ ఇతర మూడవ వ్యక్తి లేదా సంస్థల జోక్యాన్ని సహించబోమని సృష్టం చేసింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం తదితర అంశాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదాలను తమ రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ సృష్టం చేసింది. తద్వారా భారత్తో స్నేహం పేరుతో అమెరికా పాకిస్తాన్కు మద్దతు పేరుతో చైనా వంటి మూడవ దేశం ప్రమేయాన్ని భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.













