మాన్ సూన్ సేల్ ఆఫర్ ప్రకటించిన గోఎయిర్
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కంపెనీ గోఎయిర్ మాన్సూన్ సేల్ ఆఫర్లో భాగంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. పరిమిత కాలం ఆఫర్ కింద 1,299 రూపాయల డిస్కౌంట్ ధరతో వన్‌వే టికెట్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ టికెట్ల అమ్మకం సోమవారం అర్థరాత్రి ప్రారంభమై మూడు రోజుల పాటు సాగుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న వారు జూన్ 24 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. 1,299 రూపాయల ధర (పన్నులు, ఫీజులు కలిపి)తో ప్రారంభమయ్యే టికెట్లను సంస్థ సర్వీసులు అందిస్తున్న 23 సెక్టార్లతో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రూటు, ఫ్లైటు, సమయాన్ని బట్టి విమాన టికెట్ల ధరల్లో మార్పులు ఉంటాయని పేర్కొంది. 23 గమ్యస్థానాలకు వారంలో 1,544కు పైగా విమాన సర్వీసులను గోఎయిర్ నడిపిస్తోంది. వీటిలో హైదరాబాద్, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పట్నా, పుణె, శ్రీనగర్ వంటి నగరాలకు ఉన్నాయి.













