అమెరికా సాయం తీసుకుందాం ప్లీజ్ : ఫారూఖ్ అబ్దుల్లా
కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించే క్రమంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్దమంటూ అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో స్వయంగా పాలు పంచుకుంటారని ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, అమెరికా ఆఫర్‌ను అంగీకరించాలని భారత్, పాక్‌లకు విన్నవించారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అయితే, అమెరికా ప్రతిపాదనను వెంటనే భారత్ కొట్టివేసిన సంగతి గమనార్హం. కాశ్మీర్ విషయంలో మూడవ వ్యక్తి జోక్యానికి తాము అంగీకరించబోమని భారత్ సృష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫారూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.













