వేసవి ఆఫర్ ప్రకటించిన ఏయిర్ ఏషియా
ఎయిర్ఏషియా నెట్వర్కులో మరో రెండు రూట్లను జత చేసింది. అవి కోలకతా, రాంచీ. ఈ రెండు రూట్లు కలుపుకుంటే మొత్తం 15 రూట్లకు సర్వీసులు నడుపుతున్నట్లు లెక్క. కోలకతా-రాంచీ రూట్లో చార్జీ రూ.1,999, రాంచీ-న్యూఢిల్లీ రూట్‌కు రూ.2,499, కోలకతా-న్యూఢిల్లీ రూట్‌కు రూ.2,999 టికెట్లను ఆఫర్ చేస్తోంది. ప్రయాణ తేదీలను ఏప్రిల్ 15 నుంచి 2017 నుంచి జూన్ 5, 2017 మధ్యలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. రాబోయే వేసవి సెలవును దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్ ఆఫర్ కింద అందుబాటు ధరలకే టిక్కెట్లను అందిస్తోంది. ఈ స్కీం కింద ప్రారంభ ధర రూ.1,399గా నిర్ణయించింది. ప్రస్తుతం ఏయిర్ ఏషియా బెంగళూరు, హైదరాబాద్, గోవా, గువాహతి, ఢిల్లీ, కోచి, పూనే రూట్లలో సర్వీసులు నడుపుతోంది. ఈ ఆఫర్ అడ్వాన్స్ బుకింగ్‌లు మార్చి 26, 2017 వరకు ఉంటుంది. ప్రయాణ తేదీలను ఆగస్టు 31, 2017లోగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.






