బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏసియా
ఏయిర్ ఏసియా ఇండియా మెగాసేల్ రూపంలో మరోసారి బంపర్ డిస్కౌంట్లకు తెరలేపింది. దేశీయ ప్రయాణాలకు, అంతర్జాతీయ ప్రయాణాలకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. అన్ని ధరలు కలుపుకుని దేశీయ ప్రయాణాలకు టిక్కెట్ ధర రూ.1,249 నుంచే ప్రారంభం కాబోతుందని, అదేవిధంగా విదేశీ ప్రయాణాలకు రూ.1,999కే టిక్కెట్ విక్రయించనున్నట్టు ఏయిర్ ఏసియా తెలిపింది. ఈ మెగా సేల్ 2017 ఏప్రిల్ 9 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు ఈ ఎయిర్ లైన్స్ పేర్కొంది.
గౌహతి-ఇంపాల్ అన్ని ధరలు కలుపుకుని రూ.1249, బెంగళూరు-హైదరాబాద్ రూ.1,619, కోల్కత్తా -రాంచి రూ.2,249, బెంగళూరు-గోవా రూ.1,719, న్యూఢిల్లీ-రాంచి రూ.2,699 వంటి దేశీయ రూట్లను కవర్ చేయబోతున్నట్లు ఏయిర్ ఏసియా తన వెబ్ సైట్లో పేర్కొంది. ఈ సేల్ 2017 సెప్టెంబర్ 30 వరకు ప్రయాణాలకు వర్తించనుంది. అదేవిధంగా విదేశీ విమానాలపై కూడా ఎయిర్ ఏసియా బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్ రూ.1,999, భువనేశ్వర్-పూకెట్ రూ.3,739, భువనేశ్వర్- పెనాంగ్ రూ.3,633 వంటి దక్షిణాసియా దేశాలకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. సమ్మర్ హాలీడేస్ కోసం విహార యాత్రలకు వెళ్లే వారికోసం ఏయిర్ ఏసియా ఈ బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.













