Delhi Liquor Scam: మద్యం కుంభకోణం…చివరకు చిదంబర రహస్యమే….
మద్యం అవినీతి కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితకు భారీ ఊరట లభించింది. మద్యం పాలసీ కేసుపై తాజాగా విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు, నిందితులపై నమోదు చేసిన కేసులను కొట్టేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది. సరైన ఆధారాలు లేకుండానే వీరి పేర్లు కేసులో చేర్చారని సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని కోర్టు సీబీఐపై మండిపడింది కూడా.
అలాగే సీబీఐ సరైన సాక్ష్యాలు, మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని, ఛార్జ్ షీట్ లో అనేక లోపాలు వున్నాయని, వాటికి సాక్ష్యులు లేదా స్టేట్ మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది.
ఇక.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, కన్నీటిపర్యంతం అయ్యారు. అధికారం కోసం ప్రభుత్వాలను కూల్చొద్దన్నారు. ’’ ఈ రోజు మద్యం కేసులో నిందితులందర్నీ కోర్టు విడుదల చేసింది. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం వుంది. ప్రధాని, కేంద్ర హోంమంత్రి కలిసి నా పార్టీని అంతం చేయడానికి పెద్ద రాజకీయ కుట్రే పన్నారు. మా పార్టీలోని ఐదుగురు కీలక నేతలను జైల్లో పెట్టారు. సీఎంగా వున్న సమయంలో నన్ను కూడా జైల్లో పెట్టారు. నేను అవినీతిపరుడ్ని కాదు. కోర్టు కూడా అదే చెప్పింది’’ అంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
అసలు ఢిల్లీ మద్యం అవినీతి కేసు ఏమిటంటే…
2021-22 లో ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2021 లో నూతన లిక్కర్ పాలసీని అమలులోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లుపిలిచి, ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. పాత విధానంలో 750 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్ హోల్ సేల్ ధరను 166.71 అయితే.. కొత్త విధానం ప్రకారం 188.41 కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని 223.89 నుంచి నామమాత్రంగా 1.88 కు, వ్యాట్ ను 106 నుంచి 1.90 కి తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే లాభాన్ని 33.35 నుంచి ఏకంగా 363 రూపాయలకు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందించారు.
అలాగే 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానంలో, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు పెద్ద ఎత్తున కిక్‌బ్యాక్‌లు (నిధులు) పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీ ద్వారా 60% ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. “సౌత్ గ్రూప్” (దక్షిణాది గ్రూప్) నుండి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్‌లను ఆప్ నేతలు తీసుకున్నారని, దానికి ప్రతిఫలంగా మద్యం వ్యాపారులకు అనుకూలంగా లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
ఇక.. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల ద్వారా నిర్వహించే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించేలా అప్పటి ఆప్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. వ్యాపారులకు 12 శాతం లాభం దక్కేలా చేసినందుకు ఆప్ నేతలు 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారన్నది ఆరోపణ. ఒక్క మాటలో చెప్పాలంటే ముడుపుల రూపంలో కొల్లగొట్టింది 100 కోట్లు అని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మాత్రం 600 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు.
అలాగే మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారని, మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా మాఫీ చేసేసింది. ప్రతీ బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. ఎల్-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారు. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు సీబీఐ గుర్తించింది.
కవిత పాత్ర ఏందంటే..
మద్యం పాలసీలో ఒప్పందంలో భాగంగానే సమీరు మహేంద్రకు చెందిన ఇంటో స్పిరిట్ లో సౌత్ గ్రూపుకు దక్కిన 65 శాతం వాటాలో పిళ్లైకు 32.5 శాతం దక్కిందట. ఇతను కవిత బినామీ అని ఈడీ చెప్పింది. ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్ గా కవిత కాగితాల మీద చూపించడానికి 3.20 కోట్లలో రూ. కోటి సమకూర్చారని తెలిపింది. 9 రిటైల్ జోన్లకు లైసెన్స్ రావడానికి పిళ్లై.. ఆప్ పెద్దలు, సౌత్ గ్రూపు సభ్యులకు మధ్యవర్తిగా వ్యవహరించారని వార్తలొచ్చాయి.
నిజానికి బీజేపీ నేత పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా నేరుగా కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలకు దిగారు. “సౌత్ గ్రూప్” (దక్షిణాది గ్రూప్) నుండి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్‌లను ఆప్ నేతలు తీసుకున్నారని, దానికి ప్రతిఫలంగా మద్యం వ్యాపారులకు అనుకూలంగా లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. “సౌత్ గ్రూప్” (దక్షిణాది గ్రూప్) నుండి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్‌లను ఆప్ నేతలు తీసుకున్నారని, దానికి ప్రతిఫలంగా మద్యం వ్యాపారులకు అనుకూలంగా లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
“సౌత్ గ్రూప్” (దక్షిణాది గ్రూప్) నుండి రూ. 100 కోట్ల కిక్‌బ్యాక్‌లను ఆప్ నేతలు తీసుకున్నారని, దానికి ప్రతిఫలంగా మద్యం వ్యాపారులకు అనుకూలంగా లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి








