కాలిఫోర్నియాలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 9వ వర్థంతి సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్న సంక్రాంతి రెస్టారెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. బే ఏరియా వైఎస్ఆర్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూఎస్ వైఎస్ఆర్సీపీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కె.వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. దీనికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు కాలిఫోర్నియాలో ఉంటున్న గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన మద్దూరి రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలో భారీ కార్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ బే ఏరియా టీమ్ సురేంద్ర అబ్బవరం, మధు వంగా, గోపిరెడ్డి, శ్రీధర్, వై విజయ్, త్రిలోక్, సహాదేవ్, అమరానాథ్రెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు.













