ఏపీ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రం నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా, తెలుగుదేశం పార్టీ రెండు, వైకాపా ఒక స్ధానాన్ని దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్, వైకాపా నుంచి ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇది వరకే ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. రెండోసారి తనను రాజ్యసభకు పంపినందుకు గాను సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.













