తమిళనాట విజయ్ ‘దళపతి’ మార్క్ జోరు.. బెంగాల్లో బీజేపీ ఆధిక్యం!
TVK: దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడుతున్నాయి. ప్రారంభ ట్రెండ్స్ గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం ప్రారంభం కాబోతుండగా, బెంగాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది.
తమిళనాడు (మొత్తం 234)..
ఇక్కడ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) సంచలనం సృష్టిస్తోంది. 84 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అధికార డీఎంకే (72), అన్నాడీఎంకే (74) గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ, విజయ్ ప్రభంజనం ముందు వెనుకబడ్డాయి.
పశ్చిమ బెంగాల్ (మొత్తం 293)..
బెంగాల్ పీఠం కోసం బీజేపీ, టీఎంసీల మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది. బీజేపీ 144 చోట్ల ముందంజలో ఉండగా, టీఎంసీ 133 స్థానాల్లో పోరాడుతోంది. కాంగ్రెస్ కేవలం 5 సీట్లకే పరిమితమైంది.
కేరళ (మొత్తం 140)..
ఇక్కడ అధికార ఎల్డీఎఫ్కు ఎదురుగాలి వీస్తోంది. యూడీఎఫ్ (UDF) కూటమి 95 స్థానాల్లో ఆధిక్యత చాటుతూ అధికారానికి చేరువలో ఉంది. ఎల్డీఎఫ్ 41, ఎన్డీయే 4 స్థానాల్లో ఉన్నాయి.
అస్సాం (మొత్తం 126)..
అస్సాంలో మళ్లీ బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 94 స్థానాల్లో కమల దళం ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 27 స్థానాల వద్ద ఉంది.
పుదుచ్చేరీ (మొత్తం 30)..
ఇక్కడ ఎన్నార్ కాంగ్రెస్+ కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి అధికారం దిశగా వెళ్తోంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.
మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. ట్రెండ్స్ మారుతున్న కొద్దీ ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.








