ఓపెన్ఏఐ కీలక నిర్ణయం … ఎన్నికల ప్రచారంలో ఏఐను
సార్వత్రిక ఎన్నికల వేళ అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రీసెర్చి ఆర్గనైజేషన్, చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఏఐను అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తుల డీప్‌ఫేక్‌లు, చాట్బాట్లను నిరోధించేందుకు కృషి చేస్తామని తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. 2024లో భారత్‌తో సహా అమెరికా, యూకేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలైన చాట్‌జీపీటీ, డాల్`ఇ వంటి వాటి పాలసీల్లో మార్పులు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమగ్రతను కాపాడటం ముఖ్యమని, అలాంటి ప్రక్రియను అపహాస్యం చేసేలా తమ సాంకేతికత ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ఏఐ తెలిపింది.













