అంతరిక్ష చరిత్రలో ఇస్రో సంచలన రికార్డు…. చంద్రయాన్ 3 విజయవంతం
భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ విషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్షంగా చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్`3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
మరోవైపు భారత్ చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్ మిషన్ లూనా 25న విఫలమైంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్ ల్యాండింగ్ కావడం పట్ల పలు దేశాలు భారత్కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఈ ఘనత సాధించిన అమెరికా, రష్యా, చైనా తర్వాత స్థానంలో భారత్ చోటు దక్కించుకున్నది.













