40 ఏళ్ల తర్వాత మళ్లీ గుర్రపు బగ్గీపై.. రాష్ట్రపతి
భారత 75 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మళ్లీ గుర్రపుబగ్గీ ఆకర్షణీయంగా నిలిచింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ గుర్రపు బగ్గీపై రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి మేక్రాన్ కలసివచ్చారు. ఇరువురు నేతలు ఆహూతులకు అభివాదం చేశారు. బ్రిటిష్ కాలంనాటి టాపు లేని గుర్రపుబగ్గీని భద్రతా కారణాల రీత్యా వాడకుండా ఆపేశారు. కానీ ఇప్పుడు మరోసారి దానిని వినియోగంలోకి తీసుకువచ్చారు. సాధారణంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి, ముఖ్య అతిథి వచ్చే అత్యాధునిక లిమోసిన్ వాహనాన్ని వాడేవారు. ఆరు గుర్రాలతో నల్లని బగ్గీ, లోపలివైపు ఎర్రని వెల్వెట్ క్లాత్‌తో అలంకరణ, బంగారు వర్ణంలోని రిమ్స్, ఆశోకచక్రం చిహ్నంతో రాచఠీవితో నిగనిగలాడే ఆ వాహనం బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్టేట్ ఉపయోగించేవారు. దేశవిభజన అనంతరం ఈ గుర్రపు బగ్గీ ఎవరికి చెందాలన్నదానిపై వివాదరేగింది. పాకిస్థాన్, భారత్‌లు తమకే కావాలని పట్టుబట్టాయి. చివరకు నాణెంతో టాస్ వేశారు. టాస్ భారత్‌కు అనుకూలంగా పడటంతో భారత్‌కు దక్కింది. 2014లో ప్రణభ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గుర్రపుబగ్గీని రెండు సందర్భాలలో వాడేవారు. పార్లమెంట్లో ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేటప్పుడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా చివరి రోజు నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో గుర్రపు బగ్గీని వాడారు.













